Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురజాల గోపి
నవతెలంగాణ-మణుగూరు
టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ యాత్రను జయప్రదం చేయాలని మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గురజాల గోపి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క గుడి నుండి యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఈ యాత్రలో మణుగూరు నుండి అధిక సంఖ్యలో మహిళలు యువజన విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. దేశంలో పెరిగిపోతున్న ధరలు - నిరుద్యోగం - మతోన్మాదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేపట్టిన మహాపాదయాత్ర సందేశాన్ని ఊరూవాడా చేరవేయడానికి హత్ సే హత్ జోడో యాత్రతో మనముందుకు వస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిటిసి ముక్కెర లక్ష్మణ్, షరీఫ్ నూరుద్దీన్, గొల్ల సాంబయ్య, మోహన్ నాయక్, కిషన్ నాయక్, డేనియల్, సత్తి గురజాల సందీప్, తదితరులు పాల్గొన్నారు.