Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
- రానున్న ప్రజావాణిలో చేపట్టిన చర్యలపై సమీక్షిస్తా
- ప్రజావాణికి గైర్హజరైన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, మత్స్యశాఖ అధికారులకు షోకాస్ నోటీసులు జారీకి ఆదేశం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు జాప్యం చేయొద్దని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు చేసిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి కాలుష్య నియంత్రణ మండలి ఈఈకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్ఓకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని చేసిన దరఖాస్తుల్లో పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామ కాపురస్తులు డి.లక్ష్మణ్ మరికొందరు ట్రైకార్ రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నామని సంవత్సరం అయినా ఇంతవరకు రుణం మంజూరు కాలేదని, రుణం మంజూరు చేపించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో కలెక్టర్ చర్యలు నిమిత్తం ఏపీఓ ఐటీడీఏకు అధికారులకు ఆదేశించారు. కొత్తగూడెం మండలానికి చెందిన అడపాల మధుసూదన్ రావు, విజయలక్ష్మి, అమృతాదేవి, ఉమా సత్యవాణి, సురేందర్ మేదర్ బస్తి గొల్లగూడెం రోడ్‌లోని సర్వే నంబర్ 143 ఇంటి నెంబర్ 7-3-0 10003లో 100 గజాల ఇంటి స్థలం తమ తల్లి నడపాల రాఘవమ్మ పేరున ఉందని వారసులకు తెలియకుండా మాల ఒకరైన అడపాల వెంకటరమణరావు తన పేరును పట్టా చేయించుకున్నారని, అట్టి ఇంటి స్థలం వారసులందరికీ చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎండార్స్ చేశారు. చంద్రుగొండ మండలానికి చెందిన ఎస్.కె.కాశమ్మ భర్త లేటు షర్ఫుద్దీన్ సర్వేనెంబర్ 10లో తన కుమారుడు ఎస్.కె.సైదులు (లేటు) పేరుతో వారసత్వంగా లభించిన ఇంటి స్థలమును ఇతరులు ఆక్ర మించడానికి ప్రయత్నం చేస్తున్నారని తనను భూమిలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని పేర్కొంటూ సర్వే చేపిం చి అద్దం నిర్వహించి అప్పగించాల్సిందిగా తహసీల్దార్ ఎండా ర్స్ చేశారు. వివిధ మండలాల నుంచి వినతులు కలెక్టర్ స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్రమబద్ధీకరణ పట్టాలు విచారణ ప్రక్రియ పూర్తి చేయాలి : కలెక్టర్
క్రమబద్ధీకరణ పట్టాలు విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అనిదీపు తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ కార్యాలయంలో నిర్వహించిన కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో జీవో నెంబర్ 76 ద్వారా చేపట్టిన ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ గ్రామపంచాయతీ భవనాలు నిర్మాణం మున్సిపాలిటీలు అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రకటించిన నిధులతో చేపట్టనున్న పనుల తదితర అంశాలపై జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఇల్లందు మండలాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తులు విచారణలో ఉన్నాయని తక్షణమే విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్య వస్తే తక్షణమే డీఆర్ఓ దృష్టికి తెచ్చి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రామపంచాయతీలు భవనాల నిర్మాణాల ప్రగతిని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికా రులతో సమీక్షించారు. భద్రాచలం డివిజన్ పరిధిలో భవ నాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని అసం తృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ కొత్తగూడెం ఇల్లందు పాలించే మణు గూరు మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.