Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత హామీలు ఏమైనవి..?
- సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్లో భద్రాచలం సమస్యలను దారుణంగా విస్మరించిందని సీపీఐ(ఎం) భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర్లు ఆరోపించారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని అందులో వరదల సందర్భంగా ఇచ్చిన వెయ్యి కోట్ల వాగ్దానం, అంతకుముందు భద్రాచలం టెంపుల్ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.100 కోట్లు సమస్యలపై నోరు మెదపలేదని అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తినటువంటి సమస్యలు అందులో భాగంగా భద్రాచలం ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. వరదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పోలవరం ముంపు వలన తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చెందిన ఆందోళన, ఆవేదన ఈ బడ్జెట్ రూపకల్పనలో కల్పించ లేదని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం నియోజకవర్గానికి ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి జరిగిన అన్యాయాన్ని ఏ రూపంలో పూడుస్తారో ఈ బడ్జెట్లో ప్రకటిస్తా రని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. కరకట్ట ఎత్తు పెంచి భద్రాచలం రాముడితో పాటు ప్రజలను కాపాడ డానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆశించినటువంటి ప్రజలకు ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం పోలవరం వలన నష్టపోతున్న ప్రజలకు తగిన భద్రత కల్పించడంలో విఫలం చెందిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు వలన నష్టపోతున్న ప్రజానీకానికి తగిన నష్టపరిహారం చెల్లించే దాంట్లో భద్రత కల్పించే దాంట్లో ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం ఆవేదనకు గురిచేసిందని అన్నారు. భద్రాచలం నియోజకవర్గం పైన ఆది నుండి తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రతి పక్షంగా ఉన్న కాంగ్రెస్‌కి భద్రా చలం నియోజకవర్గం పైన ఎటు వంటి ప్రేమ లేదని తగిన విధంగా స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీలో భద్రాచలం నియోజకవర్గ సమ స్యలపై ప్రస్తావించాలని, నిలదీ యాలని, అవసరమైతే బారు కట్ చేసైనా నిధులు సాధించడానికి స్థానిక శాసన సభ్యులు కృషి చేయాలని కోరారు. అలాగే భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీలో పోడు భూముల పట్టాల విషయంలో నిర్దిష్టమైన ప్రకటన వస్తుందని గిరిజనులు ఎదురు చూశారని, స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ఇప్పటివరకు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పోడు సాగుదారులకు పట్టా హక్కులు కల్పించాలని మచ్చా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.