Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎస్పీ వినీత్.జి
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారులు సోమవారం కొత్తగూడెంలోని ఓఎస్డీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓఎస్డి టి.సాయి మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఎస్పీ వినీత్.జి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 తరువాత అనేక మంది ఒత్తిడికి లోనై అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి కంటి పరీక్షలు చేయించుకుని, సమస్య ఉంటే వెంటనే ఉచితంగా అందజేసే కళ్ళజోళ్లను పొందాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య ఆధికారిణి డాక్టర్ జెవిఎల్. శిరీష, కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫీసర్ పర్ష్యా నాయక్, హెల్త్ ఎడ్యూకేటర్ టి.విజరుకుమార్, డిపిఓ దుర్గ, ఆర్ఐ ప్రసాద్, ఇతర సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.