Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం లీగల్
జిల్లా కోర్టులో నూతనంగా 'లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్'ను సోమవారం వర్చువల్ విధానంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి.నవీన్ రావ్ ప్రారంభించారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాలకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కొత్తగూడెంలో చీప్ లీగల్ ఎయిడ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్గ నలుగురు న్యాయవాదులు నియమించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఆర్థికంగ దిగువ రేఖకు ఉండి ఎవరైతే ఆర్ధికంగా న్యాయవాదిని నియమించుకోలేని వారికి ఉచిత న్యాయం లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం ద్వారా త్వరితగతిన వారికి న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా నియమించబడ్డ నలుగురు న్యాయవాదులకు త్వరలో ట్రైనింగ్ ఉంటుందని తద్వారా వారు న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా అస్పిరేషనల్ జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తీసుకోవడం జరిగినదని, సెక్షన్ 12 ప్రకారం ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.శ్యాంశ్రీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి.భానుమతి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆడేపు నీరజ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, ఉపాధ్యక్షుడు శరత్, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, కార్యవర్గ సభ్యులు తదితరులుహాజరయ్యారు.