Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడం దారుణం
- మైనార్టీ జిల్లా అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా
నవతెలంగాణ-పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లల్లో గత 6 ఏళ్లుగా మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మైనారిటీ జిల్లా అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మైనారిటీలకు 2200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారన్నారు. కానీ, షాదిముబారక్, మైనారిటీ గురుకులాలు తప్పా ఏ ఒక్క పథకం కూడా మైనారిటీల కొరకు ప్రవేశపెట్టలేదన్నారు. రాష్ట్రంలో మైనారిటీ గురుకుల డిగ్రీ కళాశాల, స్టడీ సెంటర్ల ఏర్పాటు ప్రస్తావన తేలేదు, సీఎం ఓవర్సీస్ పధకం కింద ఉపకార వేతనాలకు ధరఖాస్తు చేసుకొని, విదేశాల్లో విద్యను అభ్యసించిన విద్యార్థుల కోర్సులు పూర్తి అయినప్పటికీ, నేటివరకు ఉపకార వేతనాలు సుమారు 150 కోట్ల వరకు విడుదలకు నోచుకోలేదు, రాష్టంలో మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాలు గత కొన్నేళ్లుగా 202.11 కోట్ల రూపాయలు విడుదలకు నోచుకోలేదని మండిపడ్డారు.
మసీదుల్లో సేవలు అందిస్తున్న మౌజాన్, ఇమామ్లకు రెండవ విడతలో గౌరవ వేతనాల కోసం 4 వేల మంది ధరఖాస్తు చేసుకొని 5 యేండ్లు కావస్తున్నా వాటి ఉసే మర్చిపోయారని, రాష్ట్రంలో మైనారిటీ కమిషన్ పాలక మండలిని గత రెండు ఏళ్లుగా నియామకానికి నోచుకోలేదని అన్నారు. 20 వేల మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు ప్రకటించారని, వాటిని ఎక్కడ పంచారో స్పష్టత లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మైనారిటీ సమస్యల పట్ల పరిష్కార దిశగా అడుగులు వేయాలని అని కోరారు.