Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భావనల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో కొత్త రోడ్ల ఏర్పాటు, రోడ్ల మరమ్మతుల పనులు అలాగే తదితర సమస్యల పై వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిదంగా సెంట్రల్ లైటింగ్ పనులు వేగవంతం చేయాలని కోరారు.
అదేవిదంగా నియోజకవర్గంలోని దమ్మపేట మండలంలో అంకంపాలెం, పార్కలగండి, అశ్వారావుపేట మండలంలో అచ్యుతపురం, ఉట్లపల్లి, కావడిగుండ్ల వద్ద సబ్ స్టేషన్ల అవసరం ఉండటంతో ఏర్పాటు గురించి, మండలాల్లో సబ్ స్టేషన్ల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం ఉన్న వారిని రెగ్యులర్ చేయడంపై సంబంధిత శాఖ మంత్రి జగదీష్ రెడ్డినీ కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.