Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్ట బంగారం తెచ్చి అమ్మవారికి అఖంఢ దీపారాధన
- పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణలు
- అలరించిన గుడ్ విల్ అర్కెస్ట్రా (సినీ మ్యూజికల్ నైట్)
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహౌత్సవములు సోమవారం గ్రామ పొలిమేర కట్టుటతో ప్రారంభం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే అమ్మవారి జాతర ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు చిన్ననల్లబల్లి వాస్తవ్యులు దోసపాటి రాజేష్ దంపతులు అందజేసిన పట్టు చీరతో ఉదయం అలంకరణ, ఎటపాక వాస్తవ్యులు ఏవి రామారావు, గంగాభవాని దంపతులు అందజేసిన పట్టుచీరతో మద్యాహ్నం, కేశవపట్నం వాస్తవ్యులు వేముల సాంబయ్య జ్ఞ్నాపకార్దం వారి శ్రీమతి సుబ్బమ్మ కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరలతో సాయంత్రం అభిషేకములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పాటు వారు అందజేసిన నగదుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు మేళతాళాలు మంగళవాయిద్యాలు డప్పులు, డాన్సులతో పుట్ట బంగారం తెచ్చి అమ్మవారికి అఖంఢ దీపారాధన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 8.30 గంటలకు ఆలయ కళావేదిక వద్ద తాడేపల్లిగూడెం వారిచే గుడ్ విల్ అర్కెస్ట్రా (సినీమ్యూజికల్ నైట్) వారిచే నిర్వహించిన సాంసృృతిక కార్యక్రమం ప్రేక్షకులను అలరించాయి. మొదటి రోజు అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభం కాగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.