Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటాయింపులలో ఉన్న శ్రద్ధ వాస్తవ వ్యయంలో లేదు
- జిల్లాలో ఉన్న పట్టణాలకు, ప్రాజెక్టులకు, భద్రాచల నియోజకవర్గానికి, కేటాయింపులు ఏవి...?
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులలో అధికంగా ఉన్నప్పటికీ, గత బడ్జెట్లో కేటాయించిన నిధులు బడుగు బలహీన వర్గాల రంగాలకి ఖర్చుల విషయంలో 60 నుంచి 70శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను ప్రాజెక్టులకి ఇతర రంగాలకి మళ్ళించి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. డబల్ బెడ్ రూమ్‌లోకి కేటాయింపులు ఎక్కువగా చూపెట్టినప్పటికీ ఆచరణలో మాత్రం ఎక్కువ శతం పేదలకు చెందలేదని విమర్శించారు. భద్రచలం ప్రజల సంక్షేమం కోసం, కరకట్ట నిర్మాణంకై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, రూ.1,000 కోట్లు కేటాస్తామని చెప్పిన కేసీర్ మాటలు ఏమయ్యాయని....? ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో చూపిన పద్దుల్లో వికలాంగులపై వివక్ష చూపెట్టడం సరైంది కాదన్నారు. గత బడ్జెట్లో కేటాయించిన పద్దుల్లో ఖర్చుల విషయంలో సుమరు రూ.3 లక్షల కోట్ల వరకు కాపిటల్ వ్యయం చూపించడంలోనే అసలు వ్యయం అర్థం అవుతుందని అన్నారు. కేటాయింపులు అధికంగా చూపెట్టినట్టు కనిపించినా, వ్యయంలో మాత్రం నామమత్రపు ఖర్చులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ సంవత్సరపు బడ్జెట్లో అయినా, కేటాయింపులన్నీ కూడా ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని, బడుగు బలహీన రంగాలన్నింటిలో ఖర్చులు చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.