Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్‌కి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నాసిరకం పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వల్లే తరచు లీకేజీలు ఏర్పడుతూ మంచినీటికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. కిన్నెరసాని నీటికి నెల, నెల లక్షలు ఖర్చు చేస్తున్నారే కానీ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. రామవరంలోని ఓవర్ హెడ్ ట్యాంకు పనులు పూర్తయిన చిన్న మైనర్ పనులు మాత్రమే ఉన్నాయని వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు. రేగళ్ల ప్రాంతంలో గిరిజన రైతు నుంచి అర ఎకరం భూమిని నీటి ప్రాజెక్ట్ కోసం తీసుకుని భాదితుడికి నష్టపరిహారం చెల్లించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని లేనియెడల పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, నిరంజన్ కుమార్, శరత్, పవన్, వంశీ తదితరులు పాల్గొన్నారు.