Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
పన్నులు, అదనపు చార్జీలు, అపరాధ రుసుముల పేరుతో ప్రజలపై భారాలు మోపితే సహంచబోమని, పేద ప్రజలను లూటీ చేసే చర్యలను పాలకులు మానుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాష అన్నారు. విధ్యుత్ శాఖ ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి త్రీ-ఫెస్తో కూడిన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తుదారులందరికీ విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారికి అందించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, పార్టీ, ప్రజా సంఘాల నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు, బాగం మహేశ్వర్రావు, శ్రీనివాస్, నేరెళ్ళ శ్రీనివాస్, రాజయ్య, షాహీన్, దాసరి జ్యోతి, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ ప్రజలపై అదనపు భారాలు సహించమని, ఏసీడీ చార్జీలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. ఏసీడీ చార్జీలు ఉపసంహ రించుకోవాలని, వ్యవసాయానికి త్రీఫేసుతో కూడిన నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా చేయాలని, దరఖాస్తుదారులందరికీ విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రదర్శన విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విద్యుత్ ఏడిఈకి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ.పద్మజ, సీపీఐ ప్రజాసంఘాలు నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, రాజు, శీను, రమేష్, సంఘమిత్ర, లక్ష్మి, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
దెమ్మపేట : రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యార్లగడ్డ భాస్కరరావు అన్నారు. సోమవారం దమ్మపేట విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయం ఎదుట సీపీఐ, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ పై ఏసీడీ రద్దు చేయాలని, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ధర్నా, మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి సుంకుపాక ధర్మ, ఏఐటీసీ మండల కార్యదర్శి బెజవాడ రాము, దొంగ లక్ష్మీనారాయణ, రాపోలు శివన్నారాయణ, మహిళా సంఘం కార్యదర్శి జానీ బేగం, శాంతి, రైతు సంఘం నాయకులు విజయలక్ష్మి, కృష్ణవేణి, నాగమణి, వీర లక్ష్మి, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : విద్యుత్ అదనపు వినియోగం చార్జీలను రద్దు చేయాలని విద్యుత్ కార్యాలయాలు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు సయ్యద్ సలీం మాట్లాడారు. అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గన్నిన రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, సజ్జ శ్రీను, నరసింహారావు, మండల మహిళా మండలి కార్యదర్శి సత్యవతి, షేక్ దిల్షాద్ పాల్గొన్నారు.
టేకులపల్లి : ప్రజలను దోపిడీ చేసే ఏసీడీ చార్జీలు రద్దు చేయాలని, రైతాంగానికి కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాల యం ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సంద ర్భంగా పార్టీ జిల్లా కౌన్సిలర్ రామ్ చంద మాటా ్లడారు. అనంతరం విద్యుత్ శాఖ హట్కర్ దేవా ఏఈకి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో పార్టీ మండల కార్యవర్గ సభ్యులు అయిత శ్రీరాములు, జాటోతు పాండ్యా, లక్ష్మణ్, కృష్ణ, రాజయ్య, మోహన్, సోనీ తదితరులు పాల్గొన్నారు.