Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్
నవతెలంగాణ-ఖమ్మం
అదాని గ్రూప్లపై నిష్పక్షపాత విచారణ జరిపించి సామాన్య మద్దతు తరగతి పేదల సొమ్మును విడిపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం టిపిసిసి, సిఎల్పి పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు, టీపీసీసీలు సభ్యులు మహమ్మద్ జావేద్, రాయల నాగేశ్వరరావులతో కలిసి సోమవారం సిటి సెంట్రల్ ఫంక్షన్ హాల్ వద్ద నుండి రోటరీ నగర్ ఎస్బిఐ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాదిమంది భారతీయుల కష్టార్జిత పొదుపును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్ఐసి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టే అంశంపై పార్లమెంట్లో చర్చను ప్రారంభించాలని అన్నారు. ఎల్ఐసి, ఎస్బిఐ లు మన దేశానికి గర్వకారణమని, కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బుతో అవి నిర్మించబడ్డాయని అన్నారు. నేడు మోడీ తన ప్రాణ స్నేహితునికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అధాని గ్రూప్ లో ఎల్ఐసీ, ఎస్బిఐ మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ బ్యాంకులకు అధాని గ్రూప్ సుమారు 80వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని అన్నారు. అదంతా సామాన్య ప్రజల కష్టార్జితమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, వైరా నియోజకవర్గ పిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు, మాళోత్ రాందాస్ నాయక్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య, జిల్లా యస్సి సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నగర కాంగ్రెస్ కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, పల్లెబోయిన భారతి చంద్రం, లకావత్ సైదులు నాయక్, కామేపల్లి జిల్లా పరిషత్ సభ్యులు భాణత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.