Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:గ్రీవెన్స్ డేకు వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ''గ్రీవెన్స్ డే''లో అర్జీదారులు నుండి జిల్లా కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. చింతకాని మండలం లచ్చగూడెంకు చెందిన షేక్ ఖాసీంసాహెబ్ తాను వ్యవసాయ కూలీనని.. ఆసరా పింఛను మంజూరుకు సమర్పించిన దరఖాస్తును జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పరిశీలించి తగు చర్యలకు ఆదేశించారు. కూసుమంచి మండలంకు చేగొమ్మ గ్రామంకు చెందిన పోటు పెంటయ్య తనకు చేగొమ్మ రెవెన్యూ పరిధిలో గల ఖాతానం. 67లో సర్వేనెం. 80 ఆ2/1/1లో తనకు 1,3100కు గాను ఆన్లైన్లో, 1700 కుంటలు మాత్రమే చూపిస్తున్నదని 0.14 కుంటల భూమి నమోదు చేయాలని దరఖాస్తు చేశారు. ఖమ్మం నగరం మామిళ్ళగూడెంకు చెందిన అనుగోజు హిమబిందు తాను వితంతురాలినని, తనకు ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్యకై రఘునాథపాలెం మండల తహశీల్దారును ఆదేశించారు. కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామంకు చెందిన తీర్థాల సూర్యనారాయణ ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో తన తండ్రిగారి ఆస్తి 30 ఎకరాల వ్యవసాయ భూమిలో ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి పాసుపుస్తకాలు చేయించుకున్నారని వారి వద్ద నుండి తన వాటా తనకు ఇప్పించాలని కోరారు. కూసుమంచి మండలం సుంగల్ తండా గ్రామ పంచాయతీకి చెందిన తేజావత్ రమేష్ తెల్లరేషన్ కార్డు ఇప్పించాలని సమర్పించిన దరఖాస్తు చేశారు. రేగుల చెలక గ్రామ సర్పంచ్ కె. రామారావు రఘునాథపాలెం మండలం రేగుల చెలక గ్రామ పంచాయితీకి చెందిన సర్వేనెం. 228లో 0-27 కుంటలు మంచినీటి బావుల ఖాళీ స్థలం దురాక్రమణ కాకుండా చూడాలని కోరారు. సింగరేణి మండలం తొడితలగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ గిరిజన ప్రాంతమైన తొలగూడెంలో మత్స్యపారిశ్రామిక సంఘం ఏర్పాటు చేయించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా అధికారులు తదితరులు ''గ్రీవెన్స్ డే'' లో పాల్గొన్నారు.