Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని అమరారం గ్రామంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శేఖర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం విప్ రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, యువకులు పాల్గొన్నారు.