Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలికల గురుకుల పాఠశాలకు నీటి ఎద్దడి
- ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
నవతెలంగాణ-అశ్వారావుపేట
నలుగురు ఉన్న ఇంట్లోనే నీటి ఎద్దడి వస్తే ఇబ్బందులు ఎన్నో మన అందరికీ స్వీయ అనుభవమే. అదే నాలుగు వందలు పైగా ఆడ పిల్లలు ఉండే వసతి గృహంలో ఒక రోజు మొత్తం నీటి సౌకర్యం లేకపోతే వారి బాధలు ఎంతని చెప్పగలం. అద్దె భవనంలో నడుస్తున్న స్థానిక మహాత్మా జ్యోతీ రావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ గురుకుల బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురైంది. 420 మంది విద్యార్ధినులు ఉన్న ఈ వసతి గృహంలో నీటి ఎద్దడి నివారణకు ప్రిన్సిపాల్ తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. రెండు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఎంత మేర ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే. పైగా ఆ నీటిని ఎవరికి వారు బకెట్లతో వారి గదుల్లోకి చేర్చడం తలకుమించిన భారమే అని చెప్పుకోవాలి. అయితే భవనం యజమాని బోరు మరమ్మత్తులకు నిరాకరించడంతో ప్రిన్సిపాల్ స్వప్న గురుకుల అధికారులకు నివేదిక పంపారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరా చేయాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.