Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందులు వాడితే ఎక్కువ కాలం జీవించే అవకాశం
- డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ జెవిల్.శిరీష
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజంలో ఏయిడ్స్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుందని, ఏయిడ్స్ బారిన పడిన వారు సక్రమంగా మందులు వాడితే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జెవిల్. శిరీష అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వారి ఆద్వర్యంలో కొత్తగూడెం పట్టణంలోని రైతు బజార్, కూరగాయల మార్కెట్లో కళా జాత కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాజాతను డిఎం అండ్ హెచ్ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా (హెచ్ఐవి) ఎయిడ్స్ బారిన పడిన వారు సక్రమంగా మందులు వాడితే ఎక్కువ కాలం జీవించే అవకాశముందని తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వివిధ ప్రాంతాలలో కళా జాతా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటి డిఎం అండ్ హెచ్ఓ ఫైజ్మొయిద్దీన్, డిపిఎంఓ టి.మోహన్, హెల్త్ ఎడ్యూకేటర్ టి.విజయ కుమార్, జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రామ్ మేనేజర్ సత్య కుమార్, సెక్యూర్ ఎన్జీఓ బాధ్యులు రాజేంద్ర ప్రసాద్, స్టాఫ్ నర్స్ రాణి, సూపర్వైసర్ మధు, లింకు వర్కర్స్ పాల్గొన్నారు.