Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయస్థాయిలో 19వ స్థానం సాధించా
- మహిళా కౌన్సిలర్లను అగౌరవపరచానని, భూ కబ్జాలు చేశాననడం అబద్దం
- అవిశ్వాసం తీర్మానం నోటీస్ ఇవ్వటం బాధాకరం
- నవతెలంగాణతో మున్సిపల్ చైర్మెన్
నవతెలంగాణ-ఇల్లందు
నన్ను నమ్మి గెలిపించి పట్టణ ప్రథమ పౌరుడిగా నిలబెట్టిన ప్రజల కోసం పట్టణ అభివృద్ధికై నిలబడ్డాను. సీఎం కేసీఆర్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్, అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ సహకారం, ప్రోత్సాహంతో మూడేళ్ల కాలంలో మున్సిపాలిటీని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశానని మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు నవతెలంగాణతో అన్నారు. కింది స్థాయి నుంచి వచ్చి కష్టపడి ఎదిగి 25 సంవత్సరాలుగా ఇల్లందు పట్టణంలో విద్యాసంస్థలు స్థాపించానని తెలిపారు. అనేకమంది విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎదిగేలా కృషి చేశానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్‌గా ఇచ్చిన భాద్యతను రాత్రనక పగలనకా పట్టణ అభివృద్ధిని కాంక్షిస్తూ అధికారులని, కార్మికులను సమన్వయం చేసుకుంటూ ఇల్లందు పట్టణాన్ని ఆదర్శంగా రాష్ట్రం మొత్తం ఇల్లందు వైపు చూసేలా చేశానని తెలిపారు. సహకరించిన అందరికీ ధన్యవాదాలు. కొంతమంది మహిళా కౌన్సిలర్లను అగౌరవ పరిచానని, ప్రభుత్వ భూమిని కబ్జా చేశానని ఆరోపణలు చేసి అనేక ఇబ్బందులు పెట్టినా, మానసికంగా కుంగదీసిననూ బ్లాక్ మెయిల్ చేసిననూ నిబద్ధత కలిగిన వ్యక్తిగా నాపై వచ్చిన ఆరోపణలపై అధికారులు 30 రోజుల పాటు నిర్వహించిన విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు.
రాష్ట్రం ఇల్లందు మున్సిపాలిటీ వైపు చూసేలా చేశాం
అవినీతిని అరికట్టాం
2020-2021 స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఇల్లందు పురపాలక సంఘానికి జాతీయస్థాయిలో 19వ స్థానంలో నిలిపా. 2021-2022 స్వచ్ఛ సర్వేక్షన్ పోటీల్లో ఇల్లందు పట్టణానికి 18వ స్థానం తెచ్చా. జిల్లాస్థాయిలో మూడు సంవత్సరాలు వరుసగా ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడడంలో కృషి చేశా. ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధిని చూసి రాష్ట్ర మున్సిపల్, రవా ణా శాఖ మంత్రులు కేటీఆర్ పువ్వాడ చేత ప్రశంసలు అందుకొన్నాం. మున్సి పాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసేందుకు ఇతర జిల్లాల నుండి ఇల్లందుకు వచ్చేలాగా చేశాం. సీడీఎంఏ కమిషనర్ ఇల్లందు పట్టణానికి వచ్చి అభివృద్ధి పనులు పరిశీలించి అభినందించారు. 26 డే సందర్భంగా ఉత్తమ మున్సిపాలిటీగా కలెక్టర్ చే ప్రశంస పత్రాలు అందుకున్నాము. కష్టపడి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకేనా ఈ అవమానాలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మూడేళ్లలో మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి
దుర్గంధం వెదజల్లే బుగ్గవాగును ప్రక్షాళన చేశా. బుగ్గ వాగుకు ఆనుకొని ఉన్న 500 ఇండ్లను నీట మునగకుండా కాపాడాం. 24 వార్డులకు 41 వాహనాలు ఇంటింటికీ ప్రతిరోజు చెత్త సేకరించే ఏర్పాటు చేశాం. సేకరించిన తడి చెత్తను ఎరువుగా మార్చేందుకు రాష్ట్రంలోనే అతిపెద్ద ఎరువు తయారీ కేంద్రాన్ని నిర్మించాం. జిల్లాలోని మొదటి ఫికల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మానవ వ్యర్ధాల శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సెంట్రల్ లైటింగ్ వెలుగులతో నేడు రాత్రి అందాలు ఇల్లందు పట్టణం సొంతం. సంవత్సరాల ఇల్లందు చరిత్రలో మొదటి వాటర్ ఫౌంటెన్ నిర్మించాం. పట్టణంలో ఏ ప్రాంతం కూడా అంధకారంలో ఉండకూడదు అని నూతనంగా 500 కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి వీధుల్లో లెట్లు వెలిగించాం. 13 సంవత్సరాలు ఖాళీగా పక్కకు పెట్టిన పాత వాహనాన్ని బయటకు తీసి వైకుంఠరథంగా మార్చి ఇల్లందు పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. కాలు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉండే స్మశాన వాటికను సకల వసతుల స్వర్గధామంగా మార్చిన ఘనత సాధించా.
కరోనా మహమ్మారి బారినపడి మరణించిన 38 మంది అంతక్రియలు నిర్వహించా. కరోన బారినపడి సతమతమవుతున్న వారి దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాను. ప్రభుత్వ భూములు పరుల చెంతకు చేరనివ్వకుండా ఇల్లందు మున్సిపాలిటీకి 39 ఎకరాలు సేకరించాం. వారానికి ఒక్కసారి వచ్చే నీటి సరఫరాను రోజు విడిచి రోజు ప్రతి ఇంటికి సరఫరా, పురపాల సంఘానికి ఆదాయ వనరులు పెంచేందుకు వీధి వ్యాపారస్తుల సముదాయములు షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాం.
ప్రభుత్వం నిర్దేశించిన రుసుముతోనే పంపు కనెక్షన్లు, ఆన్ లైన్లోనే ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మించుకోండని, ఇంటి నెంబర్లకు పెన్షన్లకు ఇతరములు ఏ అవసరాల కైనా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దని ప్రకటించి నడిపించాం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఆదుకున్నాం. కార్మికులకు రూ.8,500 జీతం నుండి 12,500 పెంచి మరల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రూ.15,500 పెంచి ప్రతినెల జీతాలు ఇస్తున్నాం. సంవత్సరాల ఇల్లందు చరిత్రలో మున్సిపల్ కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించాం. ఈపీఎఫ్ పీఎఫ్ పునరుద్ధరించాం.
పట్టణాన్ని ఇంత అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కొంతమంది కౌన్సిలర్లు అభివృద్ధి జరగడం లేదని నాపై అవిశ్వాసం తీర్మానం కోసం నోటీస్ ఇవ్వటం భాదాకరం. నన్ను నమ్మి పార్టీ ఒప్పచెప్పిన బాధ్యతలను నెరవేర్చే క్రమంలో, నన్ను గెలిపించిన ప్రజల కోసమే ఆలోచించాను తప్ప ఇంకా ఏదో ఆశించి రాజకీయాలకు రాలేదన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి చేయడమే తప్ప అని ప్రశ్నించారు. సహకరించిన ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి, పట్టణ ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలిపారు.