Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని కోయగూడెం, బేతంపూడి, టేకులపల్లి, పెగళ్ళ పాడు, ముక్కంపాడు, చింతోని చిలక తదితర గ్రామాలలో ఆయిల్ ఫామ్ సాగుపై వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహనా సదస్సులు మంగళవారం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి అన్నపూర్ణ మాట్లాడారు. పామాయిల్ దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసుకొనే స్థాయికి చేరాలని ప్రభుత్వము ఎస్టి, ఎస్సీ రైతులకు 100శాతం సబ్సిడీ, మిగతా వారికి 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పట్టాదారుడు పాస్ పుస్తకం కలిగి, బోరు, కరెంటు వసతులు ఉన్న ప్రతి రైతు సాగు చేసుకోవచ్చన్నారు. ఎకరానికి రూ.1140 డీడీ డీహెచ్, ఎస్ఓ భద్రాద్రి కొత్తగూడెం ద్వారా చెల్లించి 57 మొక్కలు పొందవచ్చును అన్నారు. నాలుగో సంవత్సరంలో ఆయిల్ ఫామ్ గెలలు వస్తాయన్నారు. మొదటి నాలుగు సంవత్సరాల వరకు సంవత్సరానికి రూ.4200 చొప్పున రైతు ఖాతాకు జమ చేయబడునున్నాయని తెలిపారు. ఒక ఎకరానికి 57 మొక్కలు, డ్రిప్, ఎరువుల యాజమాన్యం కోసం రూ.50వేల రాయితీ కల్పించబడును అన్నారు. రైతులు వ్యవసాయ ఉద్యాన, ఆయిల్ ఫామ్ కంపెనీ వారిని సంప్రదించాలని తెలిపారు. మండల పరిధిలో అవకాశం ఉన్న రైతులు సద్దునా ఏం చేసుకోవాలని కోరారు. అనంతరం చింతొన్చిలక గ్రామంలో ఆరికట్ల శ్రీనివాస్‌కు 28 ఎకరాల సాగు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.