Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
గత కొంతకాలంగా మణుగూరు, పాల్వంచ సూర్యపేట, ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న తురపాటి ప్రసాద్ విమ్ బంజర్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మణుగూరు డిఎస్పి రాఘవేందర్రావు తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీఐ వేణు చందర్రావు, ఎస్సై సురేష్, సీఐ ముత్యం రమేష్, ఎస్సై రాజ్ కుమార్, పురుషోత్తం, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు నమ్మదగిన సమాచారంతో మణుగూరులో పట్టుకోవడం జరిగిందన్నారు. అతని వద్ద ప్రస్తుతానికి రెండు తులాల వెండి, రెండు తులాల బంగారు వస్తువులు రికవరీ చేసామన్నారు. వీటితోపాటు పాల్వంచ, సూర్యాపేట పరిధిలో చేసిన దొంగతనం బంగారపు వస్తువులను సుమారు 10 తులాలను త్వరలోనే రికవరీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వ్యక్తిపై వ్యక్తిపై ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హసన్‌పర్తి, పాల్వంచ, మణుగూరు ఏరియాలలో సుమారు 30 వరకు దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. గతంలో హసన్‌పర్తి పోలీసు వారు, కాజీపేట పోలీసులు ఇతనిపై పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం జరిగిందన్నారు. జైలు నుండి బయటకు వచ్చాక మళ్లీ పలు దొంగతనాలు చేస్తూ మణుగూరు పోలీసులకు పట్టు పడ్డాడని తెలిపారు.