Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖపట్నం వెళ్ళిన అసమ్మతి కౌన్సిలర్లు
- చల్లార్చడంలో ఎమ్మెల్యే విఫలం...?
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపాలిటీలోని పాలకవర్గంలో అసమ్మతి తీవ్ర రూపం దాల్చింది. 24 మంది కౌన్సిలర్లో 12 మంది విశాఖపట్నం వెళ్ళినట్లు తెలిసింది. ఒక కౌన్సిలర్ భర్త ప్రముఖ మద్యం, రియల్ ఎస్టేట్ వ్యాపారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగిన సమావేశంలో కౌన్సిలర్ తమ వైపు తిప్పుకొని చైర్ పర్సన్‌గా పదవి చేపట్టేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి వచ్చి వారించడంతో మున్సిపల్ చైర్మన్‌గా దమ్మాలపాటి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక ఏడాది పాలకవర్గం సజావుగానే సాగింది. రెండేండ్లుగా చైర్మన్ వెంకటేశ్వరరావు కొందరు కౌన్సిలర్‌కు పొసగడం లేదు. అసమ్మతికి ప్రధాన కారణం మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వార్డుల పర్యటనల్లో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడం, వన్ మెన్ షో గా చేయడం, అభివృద్ధి నిధుల కమిషన్లన్నీ ఒక్కడే నొక్కేయడం లాంటి ఆరోపణలు ఉన్నట్టు పట్టణంలో చర్చ సాగింది. దీంతో ఎన్నోసార్లు కౌన్సిల్లో రభస జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ హర్సింగ్ నాయక్ కౌన్సిలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి విభేదాలు సద్దుమనిగేటట్లు చేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన సమావేశంలో వార్డుకు అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అయినప్పటికీ పరిస్థిత ులలో మార్పు రాలేదు. అటు అసెంబ్లీ సమా వేశాలు నడుస్తుండడం, కౌన్సిల్ పదవి కాలం మూడేళ్లు పూర్తి కావడంతో ముందడుగు వేశారు. మరోవైపు కౌన్సిలర్‌కు రూ.10 లక్షలు ఇస్తామంటూ ఆఫర్లు వచ్చినట్లు తెలిసింది. నివురుగప్పిననిప్పులా ఉన్న అసమ్మతి వర్గ కౌన్సి లర్లు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఇక చైర్మన్‌గా దమ్మలపాటి ఉండడానికి వీళ్లేదంటూ పట్టు పడుతున్నారు. మున్సిపల్ పాలకవర్గ పరిపాలన మూడేళ్లు పూర్తయి నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టడంతో అవి శ్వాస తీర్మానానికి అసమ్మతికి మంచి అవకాశం దొరికింది. సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నిం చారు. కలెక్టర్ తీసుకోవడం లేదంటూ ధర్నాకు దిగారు. చివరికి కార్యాలయంలో అధికారులకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇచ్చారు. దీంతో తీవ్రమానస్తాపానికి గురైన అస మ్మతి వర్గం ఇల్లందు రాకుండా సోమవారం రాత్రి నేరుగా విశాఖపట్నం వెళ్లినట్లు తెలిసింది. ఎమ్మెల్యే హరిప్రియ, అధిష్టానం ఆదేశాలు పాటించకుండా అసమ్మతి వర్గం పాలకవర్గాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చల్లార్చడంలో ఎమ్మెల్యే విఫలం...?
కౌన్సిలర్లను ఏకతాటిపై నడిపించి అసమ్మితిని చల్లార్చడంలో ఎమ్మెల్యే హరిప్రియ విఫలమయ్యారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి పాలకవర్గంలో 24కు గాను 22 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ అసమ్మతికుంపట్లు వెలుగుతున్నాయి. కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని ఇవ్వడమే రాష్ట్రంలో సంచలంగా మారింది. దీంతో ఎమ్మెల్యే హరిప్రియకున్న ఇమేజ్ తగ్గుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు బస్ డిపో ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లకు సిద్ధమవుతున్న వేళ అసమ్మతి రాగాలు రావడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాదులో బడ్జెట్ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే హరిప్రియ సమతే కౌన్సిలర్లతో చర్చించడానికి హైదరాబాదు రావాలని పిలుపునిచ్చినపట్టించుకోలేదనే ప్రచారం జరుగు తోంది. దీంతో ఎమ్మెల్యే భర్త మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్ హైదరాబాదు నుండి సోమవారం రాత్రి ఇల్లం దుకు వచ్చి క్యాంపు కార్యాలయంలో చైర్మన్ దమ్మాలపాటితో మరి కొందరు కౌన్సిలర్లతో చర్చించినట్లు తెలిసింది. ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని వారికి కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించినప్పటికీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు పాటించకపోవడం సరికాదని అన్నట్లు తెలిసింది.