Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ నిధుల ద్వారా గిరిజన గ్రామాలలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మాణం చేపడుతున్న అన్ని రకాల పనులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణం పూర్తయిన జిపిఎస్ స్కూల్స్, పీహెచ్‌సీలు, గిరిజన భవనాలు, సంబంధిత అధికారులకు అప్పగించినప్పుడే పనులు పూర్తయినట్లు భావించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ సంబంధిత డీఈ, ఏఈలకు సూచించారు. మంగళవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో పనిచేయుచున్న డీఈ, ఏఈలతో గిరిజన గ్రామాలలో చేపడుతున్న ఇంజనీరింగ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ చర్ల మండలంలోని నారాయణపురం, వైరా, సుదిమల్ల కొమరారం, లక్ష్మీ నగర్ తండా, రోడ్డు నిర్మాణాలకు సంబంధించి పనులు సంబంధిత ఏఈలు త్వరితగతిన పనులు చేపట్టి రోడ్డు నిర్మాణం పూర్తి కావాలని, మొత్తం 78 రోడ్లు నిర్మాణం చేపట్టివలసి ఉన్నదని, ఫారెస్ట్‌కు సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉంటే సంబంధిత ఎఫ్ఆర్ఓ, ఎఫ్డీఓ, తహసీల్దారులతో సంప్రదించి వారి సహకారం తీసుకొని క్లియరెన్స్ తీసుకొని పనులు పూర్తయ్యాలా చూడాలన్నారు. అలాగే తిరుమలాయపాలెంలో రెసిడెన్షియల్ పాఠశాల కాంపౌండ్ వాల్, వైరాలోని గిరిజం భవనం ఖమ్మంలోని ఎస్ఓఈ పాఠశాలల్లో మరమ్మతులను చేపట్టి పనులు పూర్తయ్యే విధంగా చూడాలని అన్నారు. కోయగూడెంలో సబ్ సెంటర్ నిర్మాణం చేపట్టి సంబంధిత వైద్యాధికారులకు అప్పగించాలని, గేట్ కారేపల్లిలో ఎల్టీఆర్ కేసుల్లో ఉన్న భూమిని ఆర్డిఓను సంప్రదించి పనులు ప్రారంభించాలని, గిరిజన గ్రామాల్లోని సబ్ సెంటర్లు, అంగన్వాడి భవనాలు, మామిడిపల్లి, పెద్ద మెడిసి లేరు, కూర్నపల్లి గ్రామాలలో ఉన్న మరమ్మతులో ఉన్న అన్ని సబ్ సెంటర్స్ త్వరగా పూర్తి చేయాలని, అలాగే అశ్వరావుపేట మండలంలోని పివి టీజీకి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్, పూసుకుంటలోని కమ్యూనిటీ హాల్ పనులు పూర్తయితే సంబంధిత గిరిజనులకు అప్పగించాలని, అలాగే కచనుపల్లి స్పోర్ట్స్ స్కూల్లో క్రీడలకు సంబంధించిన ట్రాక్, స్టేజి పనులు ఎంతవరకు పూర్తయ్యాయని సంబంధిత ఏఈని అడిగి తెలుసుకున్నారు. చిన్నపాటి పనులు ఏమన్నా ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు. భద్రాచలంలోని బీఈడీ కాలేజీలో ఫ్లోరింగు, పెయింటింగు, కరెంటు సంబంధించిన పనులు వెంటనే ప్రారంభించి తొందర్లో పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని జిపిఎస్ పాఠశాలలకు వేసిన పెయింటింగ్ సరిగా వేయలేదని తన దృష్టికి వచ్చిందని, పాఠశాలలకు అవసరమైన మరమ్మతులతో పాటు పెయింటింగ్ కూడా చాలా అందంగా వేయించాలని, అలాగే ప్రధానోపాధ్యాయుడి సహకారంతో ఆశ్రమ పాఠశాలలకు వచ్చే దారి బీటీ రోడ్లు ఉన్నచోట సీసీ రోడ్లు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, పాల్వంచ డీఈ రాములు, ఏఈ శ్రీకాంత్, భద్రాచలం డీఈ హరీష్, టి.ఏ శ్రీనివాస్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాలకు రోడ్ల ప్రతిపాదనలు రూపొందించాలి
ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలకు, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టుటకు ఫారెస్ట్ వారి అడ్డంకి లేకుండా వారి అనుమతులతో గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు వేయవలసి ఉన్నందున, దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆర్అండ్బి శాఖ వారు రూపొందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రు సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం ఐటిడిఏ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఆర్అండ్బి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్, జిల్లా ఆర్అండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.