Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూడబ్ల్యూ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజీ
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫిబ్రవరి 11,12 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించే జర్నలిస్టుల శిక్షణా తరగతులను విజవంతం చేయాలి టీయూడబ్ల్యూ (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాసరావు కోరారు. లక్ష్మీదేవిపల్లి మండలం, లోతువాగు పంచాయతీలోని రైతు వేదికలో టీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లోజీ శ్రీనివాసరావు మాట్లాడారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ఈనెల 11, 12 తేదీలలో రెండు రోజులపాటు జర్నలిస్టుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టుల శిక్షణా కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్, యూని యన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రొఫెసర్ గంట చక్రపాణి, సీనియర్ ప్రొఫెసర్లు శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
రెండు రోజుల శిక్షణ : కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాలలో ఫిబ్రవరి 11,12 తేదీలలో రెండు రోజుల పాటు శిక్షణా తరగతులకు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టుల యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులందరూ శిక్షణ తరగతులు హాజరయ్యాలా జిల్లా కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మాద్ షఫీ, టెంజ్ జిల్లా అధ్యక్షుడు వట్టికొండ రవి, ప్రధాన కార్యదర్శి సిహెచ్వి. నరసింహారావు, యూనియన్ గౌరవ అధ్యక్షులు చండ్ర నరసింహారావు, ఐజేయూ సభ్యులు గుర్రం రాజేష్, యూనియన్ గౌరవ సలహాదారు సీనియర్ జర్నలిస్ట్ మోటమర్రి రామకృష్ణ, అచ్చి ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.