Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని డీడీ రమాదేవి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏజిహెచ్ఎస్ పెద్ద మిస్సలేరు ఆశ్రమ పాఠశాలను ఆమె అకస్మికంగా తనిఖీ చేసి పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రతిభ పై ఆమె ఆరా తీశారు. ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభ పాటలపై ఆమె సమీక్షించారు. నూతన మెనూపై ఆరా తీస్తూ 10వ తరగతి విద్యార్థులకు గౌరవ ఐటీడీఏ పీవో నూతనంగా ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన మెనూ తప్పనిసరిగా ప్రధానోపాధ్యాయుడు వార్డెన్ కలిసి సక్రమంగా నిర్వహించాలని ఆమె సూచించారు. సాధారణ మెనూతోపాటు రూ.20 వేలు అదనంగా ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ పర్యవేక్షణలో ఆమెతోపాటు పెద్ద మిషిలేరు ఏజిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు ఉన్నారు.
దుమ్ముగూడెం త్వరలో జరగనున్న పదవతరగతి పరీక్షల్లో గిరిజన వసతి గృహాలలో చదువుచున్న విద్యార్ధులు 10 జీపీఏ మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణ సాదించే విదంగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి ఉపాద్యాయులకు సూచించారు. గిరిజన వసతి గృహాల రాత్రి బసలో భాగంగా లకీëనగరం గిరిజన బాలికల వసతి గృహంలో పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఉపాద్యయులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంగువాయిబాడువ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్దులతో మాట్లాడారు. ఆమె వెంట ప్రదానోపాధ్యాయురాలు ధనసరి నాగమణి, వీరాకుమారితో పాటు సబ్జెక్ట్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.