Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల తప్పిదంతో పదిమంది గిరిజనులకు అన్యాయం
- డబ్బులు వసూలు చేసిన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి
- సీపీఐ(ఎం) మండల కన్వీనర్ వెంకన్న
నవతెలంగాణ-పినపాక
పినపాక ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల చట్టాలు పకడ్బందీగా అమలయ్యే ప్రాంతంలో గిరిజన చట్టాలు అమలకు నోచుకోవడం లేదని, అసైన్ భూములకు సైతం పట్టాల విషయంలో అధికారులు వేల రూపాయలు దండుకుంటున్నారని గిరిజనులకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న మండిపడ్డారు. బుధవారం పినపాక మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. మండల పరిధిలోని జానంపేట గ్రామపంచాయతీకి చెందిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న భూములకు అర్హత పట్టాలు ఇవ్వాలని అనేకమార్లు స్థానిక అధికారులకు, జిల్లా అధికా రులకు, ఐటీడీఏ పీఓ, కలెక్టర్‌కు ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో మాకు అర్హత ఉంది అంటూ అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని వారు వేడుకోగా, ప్రస్తుతం కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ పినపాక తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో గిరిజనుల అర్జీలను పరిశీలించి గిరిజనుల మీద దయ తలచి అసైన్మెంట్ పట్టాల కొరకు ప్రపోజల్ పంపడం జరిగిందన్నారు. దీనితో సర్వే అధికారులు వచ్చి మొత్తం భూమిని సర్వే చేసిన సాయి నగర్ కాలనీలో పదిమంది అర్హులైన గిరిజనులకు అధికారుల నిర్లక్ష్యం వలన పూర్తిస్థాయిలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఈ పదిమంది గిరిజనులకు అసైన్ పట్టాలు రాకపోవడంలో ఇక్కడ నుండి రిపోర్ట్ పంపిన అధికారుల తప్ప లేక కంప్యూటర్లో పొందుపరిచే సమయంలో తప్పు జరిగిందా అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా పేద గిరిజనులు మాత్రం తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇటువంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా అధికారులు సస్పెండ్ చేయాలని పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు దుబ్బా గోవర్ధన్, మడివి రమేష్, కల్తీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.