Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు ఏరియా సింగరేణి గనులలో నిత్యం రక్షణ చర్యలు కొనసాగించాలని డీఎంఎస్ మైనింగ్ నోముల సంజీవ్ కుమార్ అన్నారు. బుధవారం అధికారిక పర్యటనకు విచ్చేసిన ఆయన ఏరియా ఇంచార్జ్ జనరల్ మేనేజర్ జి.నాగేశ్వర రావు కలసి ఉపరితల గనుల పరిశీలించారు. పీఆర్ఓసీ ఏజెంట్ కార్యాలయం నందు ఆయా గనుల అధికారులచే సాదర స్వాగతం అందుకున్న తరువాత వ్యూ పాయింట్ నుండి భారీ యంత్రాలతో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి పక్రియను పరిశీలించారు. ఓసీ ఫోర్ను పరిశీలించిన అనంతరం సంబందిత అధికారులతో గనుల యందు తీసుకుంటున్న రక్షణ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ పని ప్రదేశాలలో పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎల్లప్పుడు సునిశితంగా పర్యవేక్షించటం ద్వారా ప్రమాదలను నివారించాలి అని సూచించారు. అలాగే ఉపరితల గనులలో ఓబి వెలికితీత పనులను నిర్వర్తిస్తున్న ప్రయివేట్ కాంట్రాక్టర్ల మాట్లాడుతూ ఓబి వెలికితీత పనులను పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటూ ప్రమాద రహితంగా సకాలంలో రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఓ పికిఓసి లక్ష్మీపతి గౌడ్, ఏరియా ఇంజినీర్ నర్సిరెడ్డి, ఏఎసీ వెంకట రమణ, ప్రాజెక్టు ఇంజనీర్ వీరభద్రుడు, రాముడు, లింగబాబు, మదర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.