Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ 'పా' అండ్ ఫైనాన్స్ ఎన్. బలరాం
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యార్ధినులు ఆత్మ నూన్యతా భావాన్ని విడనాడితే జీవితంలో విజయాలు సొంతం చేసుకోవచ్చని, భవిష్యత్తుకు 10వ తరగతి ఒక పునాదిగా నిలుస్తుందని, మనం నేర్చుకున్న విద్యను ఎవ్వరూ దొంగిలించలేరని సింగరేణి డైరెక్టర్ 'పా' అండ్ ఫైనాన్స్ ఎన్. బలరాం అన్నారు. సింగరేణి కాలరీస్ ఎస్సి, ఎస్టి ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వ ర్యంలో బుధవారం స్థానిక షెడ్యూల్ తెగల బాలికల వసతి గృహంలో అంబేడ్కర్ సతీమణి రమాబాయి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం డైరెక్టర్ బలరామ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎస్సి, ఎస్టి ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు, సింగరేణి జిఎం పర్సనల్ వెల్ఫేర్ కె.బసవయ్య, జిఎం పర్సనల్ ఐఆర్పిఎం ఏ.ఆనందరావు, డిజిఎం పర్సనల్ కె.శ్రీనివాస రావు, ఎస్సి, ఎస్టి సంఘం కార్పొరేట్ ఉపాధ్యక్షులు మోరే రమేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.