Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రహదారిపై రైతులు రాస్తారోకో
నవతెలంగాణ-ములకలపల్లి
రైతుకు కడుపు మండింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సకాలంలో సమయాను కూలంగా విద్యుత్ సరఫరా లేకపోతే పంటలు నాశనమవ్వాలా అంటూ... రైతులు మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బుధవారం రోడ్డెక్కి రాస్తోరోకోకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తుండగా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం మండలంలో రైతులు సాగుచేసుకునే పంటలకు సక్రమంగా సమయానుకూలంగా కరెంటు ఇవ్వడంలేదని ఆరోపించారు. చేతికి వచ్చిన పంటలు నీటితడులు సరిగా అందకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో సమయానుకూలంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆందోళన నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో దమ్మపేట-పాల్వంచ ప్రధాన రహ దారి కావడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు రాస్తారోకో వద్దకు చేరుకుని రైతులకు విద్యుత్ సరఫరా సకాలంలో ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ''రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం గ్రామానికి చెందిన రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.