Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రోహం చేసిన కౌన్సిలర్లకు ప్రజలు బుద్ధి చెప్తారు
- బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-ఇల్లందు
అవిశ్వాస తీర్మానం పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన అసమ్మతి కౌన్సిలర్ల ఇండ్ల ఎదుట బీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ తివారి, పరచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా డబ్బులకు అమ్ముడుపోవడం దారుణమన్నారు. ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం తీర్మానం పెట్టడం సరికాదన్నారు. ఎవరు ఎన్ని పన్నగాలు చేసిన టీఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేరని ఎద్దేవా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసిన కొంతమంది కౌన్సిలర్లు పట్టణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. రాజకీయాలలో విలువలు ఉండాలని విలువ లేని రాజకీయాలు చేసేవారు కౌన్సిలర్‌గా అనహర్హులని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ ఆజం, వారా రవి, అంకెపాక నవీన్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, కొక్కు సరిత, మంజుల, నారాయణమ్మ, అధికార ప్రతినిధి కృష్ణారావు, సన రాజేష్, యువజన అధ్యక్షుడు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.