Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటికీ వెళ్లి కష్ట సుఖాలు తెలుసుకున్న అమ్మోరు
- మూడవ రోజు జాతరకు పోటెత్తిన భక్తజనం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల కేంద్రమైన దుమ్ముగూడెం గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామ దేవత అమ్మలు గన్న అమ్మ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 22వ జాతర మహౌత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. మూడవ రోజు బుధవారం హైదరాబాద్ వాస్తవ్యులు జయిత్రి సోనవర్మ, కార్తీక్ సిద్దార్దవర్మ కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరతో ఉదయం అలంకరణ, మద్యాహ్నం భద్రాచలం పట్టణ వాస్తవ్యులు పిన్నింటి హరిలక్ష్మణరావు, ఫణీంద్రదేవి దంపతులు మరియు కుటుంబ సభ్యులు అందజేసిన పట్టుచీరతో అమ్మవారి అలంకరణ, సాయంత్రం లకీëనగరం వాస్తవ్యులు వాకచర్ల గౌరీశంకర్, సుధారాణి, శ్రీకాంత్, లకీëపూజితలు అందజేసిన పట్టుచీరతో అమ్మవారి అలంకరణ కుంకుమ పూజ అభిషేకములు నిర్వహించారు. దీంతో పాటు భక్తులు అందజేసిన విరాళాలతో ఉచిత అన్నదానం నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు జాతర ఉత్సవాలలో భాగంగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, డప్పులు, డాన్సులతో అమ్మవారి మొదటి ఊరేగింపు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అమ్మవారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నృసింహ సేవా వాహిణి వ్యవస్థాపకులు శ్రీమాన్ కృష్ణ చైతన్య స్వామి అమ్మవారికి పట్టు చీరతో పాటు సారె అందజేశారు. మూడవ రోజు జాతరకు భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా ఆలయకమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఆద్వర్యంలో ఆలయ కమిటీ, ఉత్సవకమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు సాంస్తృతిక కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం (అంధుల) చే నిర్వహించిన రాగనేత్ర అర్కెస్ట్రా (సినీ సంగీతవిభావరి) ప్రేక్షకులను అలరించాయి. దుమ్ముగూడెం పోలీస్ శాఖ ఆద్వర్యంలో సిఆర్పిఎఫ్ బలగాలు జాతర బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.