Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడున్నర ఏళ్లు దాటిన పైసా ఇవ్వని ప్రభుత్వం
- మండల పరిషత్తు సమావేశాలకే జడ్పిటిసి, ఎంపీటీసీల పరిమితం
నవతెలంగాణ-బోనకల్
ఎన్నో ఆశలు, ఆశయాలతో గెలిచిన ఎంపిటిసి, జెడ్పిటిసిలకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తోంది. ఆయా గ్రామాల ప్రజలు ఎంపీటీసీలను గెలిపిస్తే తమ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశించారు. కానీ చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలను చేసింది. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మొట్టమొదటగా 6 ఆగస్టు 2019 జరిగింది. సుమారు ఎంపీటీసీల పదవీకాలం మూడు సంవత్సరాల ఆరు నెలలు కాలం దాటింది. ఈ పదవీ కాలంలో 15 సార్లు సమావేశాలు జరిగాయి. ఎంపీటీసీలు తమ గ్రామాల సమస్యలను మండల పరిషత్తు సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. నిధులు లేని సమస్యలు కూడా ఒక్కొక్కసారి మరలా మండల పరిషత్ సమావేశం వరకు కూడా పరిష్కారం కావటంలేదని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నికల్లో నిలబడే సమయంలో తమ శక్తి మేరకు గ్రామాల అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చామని కానీ చివరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఉత్సావ విగ్రహాల లాగా మిగిలిపోయామని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీటీసీల హోదాలో ఉండటంతో తమతమ గ్రామాల్లోని ప్రజలు అనేక సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఎంపీటీసీలు అంటున్నారు. ప్రభుత్వం తమను ఉత్సవ విగ్రహాలుగా చేసి నిధులు ఇవ్వకపోవటంతో గ్రామాల అభివృద్ధిలో తమ పాత్ర లేకుండా పోతుందని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపిటిసిలకు నిధులు ఇవ్వకుండా ఎంపిటిసి హౌదా ఎందుకు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత లాగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని వారు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కేవలం మండల పరిషత్తు సమావేశాలకే పరిమితం చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటని ఇలాగైతే తాము కొనసాగటం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిధులు కేటాయించకుండా గ్రామాల అభివద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత లేదని అంటూనే తమకు నేటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అంటున్నారు. చివరకు ఎంపీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనం కూడా ఐదారు నెలలకు ఒకసారి ప్రభుత్వం తమకు చెల్లిస్తుందని అంటున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ప్రజల నుంచి దూరం చేస్తూ అగౌరవ పరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రెండున్నర సంవత్సరాలయినా నిధులు మంజూరు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఎంపిటిసిలకు నిధులు మంజూరు చేయాలి
: ఎంపీపీ కంకణాల సౌభాగ్యం
ఎంపిటిసిలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రజలలో తమ గౌరవాన్ని కాపాడాలి. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తున్నట్లుగానే గ్రామాల అభివృద్ధి కోసం తమకు కూడా నిధులు మంజూరు చేయాలి. తాము ప్రజాప్రతినిధిగా ఉండి కూడా మరో ప్రజా ప్రతినిధి పై ఆధారపడి ఉండటం చాలా బాధాకరంగా ఉంది. నిధుల మంజూరు కోసం రాష్ట్రస్థాయిలో ఎంపీటీసీ లందరూ రాజకీయాలకతీతంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.