Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి ఉమ్మనేని లక్ష్మీనారాయణ తన జీవితాంతం పేద ప్రజల అభివృద్ధి కోసం కృషి చేశాడని సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ, లక్ష్మీపురం ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, లక్ష్మీపురం సొసైటీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు ఉమ్మనేని రవి, ఏడు నూతల లక్ష్మణరావు కొనియాడారు. మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామంలో ఉమ్మనేని లక్ష్మీనారాయణ 12వ వర్ధంతి వేడుకలను సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మినేని లక్ష్మీనారాయణ స్థూపానికి మాదినేని నారాయణ, జొన్నలగడ్డ సునీత, మాదినేని వీరభద్రరావు, ఉమ్మనేని రవి, ఏడు నూతల లక్ష్మీనారాయణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మనేని రవి అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ లక్ష్మీనారాయణ గోవిందాపురం ఎల్ గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలలో సిపిఎం అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు. మండల కేంద్రంలో సిపిఎం మండల కార్యాలయ నిర్మాణంలో లక్ష్మీనారాయణ కృషి మరువలేనిదన్నారు. పేద ప్రజలు అంటే లక్ష్మీనారాయణకు ఎంతో అభిమానం అన్నారు. ఎవరికైనా అనారోగ్యం వస్తే వెంటనే గుర్తుకు వచ్చే వ్యక్తి లక్ష్మీనారాయణ అని కొనియాడారు. ఆ విధంగా పేద ప్రజల హృదయాలలో లక్ష్మీనారాయణ చోటు సంపాదించుకున్నాడని అన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు అమరజీవి వెంకట్రావు జ్ఞాపకార్థం లక్ష్మీనారాయణ కుమార్తె దామ స్వరూప అల్లుడు కోటేశ్వరరావు గోవిందాపురం ఎల్ గ్రామంలోనే నిరుపేదలైన బంగారు పల్లి విమలమ్మ, కన్నెపోగు వెంకమ్మ, షేక్ మౌలాలిలకు నిత్యావసర సరుకులు, బియ్యం, బట్టలు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ కోడలు వెంకట్రావు, వెంకట్రావు సతీమణి సత్యవతి, కుటుంబ సభ్యులు నాగమ్మ, ఉమ్మనేని జానకిరామయ్య, బసవమ్మ, శ్రీకాంత్ సిపిఎం నాయకులు కళ్యాణపు శ్రీనివాసరావు, తమ్మారపు లక్ష్మణ్, కోట కాటయ్య, నల్లమోతు వాణి, బండి చంద్ర రావు, పొన్నం రాంబాబు, పసుపులేటి నరేష్, వల్లంకొండ సురేష్, కళ్యాణపు బుచ్చియ్య తదితరులు పాల్గొన్నారు.