Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దమ్ముంటే తక్షణమే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి
- మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ బొర్రా రాజశేఖర్
నవతెలంగాణ-వైరా
వైరా నియోజకవర్గంలో మాపై ప్రజలకున్న విశ్వాసం, నమ్మకమే ఎమ్మెల్యే గెలుపుకు కారణమని, తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే గెలవాలని మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ ఎమ్మెల్యే ఎల్ రాములు నాయక్‌కు సవాల్ విసిరారు. బుధవారం వైరాలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు పదవులు అయాచితంగా, ఊరికే రాలేదని, తమ శ్రమను గుర్తించి తమ కష్టార్జితంతోనే వచ్చాయని గుర్తుచేశారు. ఆనాడు రాములు నాయక్ అంటే నియోజకవర్గ ప్రజలకు తెలియదని, తమ పట్ల విశ్వాసం, జనామోదం ఉండటం వల్లే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కృషితో రాములు నాయక్ గెలుపొందారన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవా లన్నారు. ఎంఎల్సీ తాతా మధు ఈసారి ఎన్నికల్లో పొంగులేటి మీద పోటీచేసి డిపాజిట్ తెచ్చుకుంటే రాజకీయాల నుండి తాము శాశ్వతంగా తప్పుకుం టామన్నారు. ఎమ్మెల్యే రాములునాయక్ ఆస్తులు పొంగులేటి తనఖా పెట్టుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యేకు చదువు రాదా.. అని ఎదురు ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, జూలూరుపాడు ఎంపీటీసీ తూర్పు మధుసూదన్ రావు, రైతుబంధు కారేపల్లి కన్వీనర్ గుగులోతు శ్రీను, పెద్ద మునగాల సర్పంచ్ పరికపల్లి శ్రీను, కారేపల్లి మాధారం సర్పంచ్ అజ్మీర్ నరేష్, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, జూలూరుపాడు సొసైటీ చైర్మన్ వేళ్ళ వెంకటరెడ్డి పాల్గొన్నారు.