Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి చివరి కల్లా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
- భారాస అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి
నవతెలంగాణ-పినపాక
ఫిబ్రవరి నెల చివరి కల్లా పినపాక మండలంలో గ్రామ గ్రామంలో వీధి వీధిలో సీసీ బీటి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పినపాక మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. గురువారం బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పినపాక మండలంలోని మారుమూల గ్రామాల రోడ్ల కొరకు పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు 2 కోట్ల 30 లక్షల రూపాయలను మంజూరు చేయించారన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సంక్షేమం అభివృద్ధి అనే నినాదంతో పినపాక నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు రేగా కాంతారావు సారథ్యంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో నిలిచిందన్నారు. పినపాక మండలానికి ఫైర్ స్టేషన్ సైతం మంజూరు అయిందన్నారు. మరికొద్ది రోజుల్లో మండల వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అడుగడుగున రోడ్ల నిర్మాణం జరుగుతుందని, మట్టి రోడ్డు అనేది కనిపించదని అన్నారు. పినపాక మండలాన్ని అభివద్ధి మార్గంలో నడిపిస్తూ, ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రామికుడిలా కృషి చేస్తున్న విప్ రేగా కాంతారావుకు, మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు పినపాక మండల ప్రజల తరఫున సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, పిఏసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ, వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, భారాస మండల ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, రైతుబంధు అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దాట్ల వాసుబాబు, అమరారం ఎంపీటీసీ ఖాయం శేఖర్, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సోంపల్లి తిరుపతి పాల్గొన్నారు.