Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని పట్వారిగూడెం రైతు వేదికలో పామాయిల్ సాగులో యాజమాన్య పద్ధతులు, మండలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచుట గురించి రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి మరియన్న మాట్లాడుతూ రాష్ట్రంలోనే అశ్వరావుపేట, దమ్మపేట మండలాలు పామాయిల్ సాగుకు హబ్ గా ఉన్నందుకు గర్వపడుతూ ఇంకా మండలంలో రైతులందరూ ముందుకు వచ్చి పామాయిల్ విస్తీర్ణం పెంచాలని కోరారు. ఇందుకు రైతులు అప్లికేషన్ ఫారాలు మీ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణం అధికారులకు లేదా ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్లికేషన్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఏడీఏ అశ్వరావుపేట మాట్లాడుతూ రైతు సోదరులందరూ మొక్కల్లో అంతర పంటలుగా కూరగాయలు సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, బాలకృష్ణ, ఏఈఓలు పాల్గొన్నారు.