Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి కాలరీస్ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్వికి శ్రీనివాస్ డైరెక్టర్ ఫైనాన్స్, పా ఎస్ బలరాం, ఐఆర్ఎస్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ జి వేంకటేశ్వర రెడ్డి, జి.ఎం (సీపీడీపీ) కార్పొరేట్ ఫ్రీ సీహెచ్ నరసింహ రావు తమ అధికారిక పర్యటనలో భాగంగా గురువారం ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా ఉన్నత అధికారులతో కలిసి ముందుగా కొండాపురం భూగర్భ గనిని సందర్శించారు. అనంతరం జనరల్ మేనేజర్ కార్యాలయ సమావేశలో మణుగూరు ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకం, లక్ష్యాల సాధనపై ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఏరియా ఉన్నత అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ముగ్గురు డైరెక్టర్లు తమ సూచనలను తెలియజేశారు. మణుగూరు ఏరియా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సింగరేణి మొత్తంలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఒరవడిని కొనసాగిస్తూనే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏరియాలో సత్వహంగ కొత్త గనులకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సంవత్సరపు వార్షిక లక్ష్యమైన 116 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించి ఉత్పత్తిలో, బొగ్గు రవాణాలో ఈ వార్షిక లక్ష్యాన్ని సాధించడమే కాకుండా రానున్న 2023- 24 వార్షిక లక్ష్య సాధనకు గాను ఇప్పట్టి నుండే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పవర్‌ను, యాంత్రిక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిం చుకొని పని గంటలను 13.5 గంటల నుండి 16.00 గంటలకు పెంచడం ద్వారా లక్ష్యాలను సులువుగా సాధించగలగాలని సూచించారు. కార్మికుల సౌకర్యాలకు, సంక్షేమానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించడానికి యాజమాన్యం సిద్ధంగా ఉన్నదన్నారు. కాబట్టి వెల్ఫేర్ విషయంలో మరింత చొరవ తీసుకోవాలని సూచించారు.
2023 -వార్షిక లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు 116 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించేందుకు మాన్ పవర్ ను యంత్ర సామగ్రిని ఉపయోగించుకోవాలన్నారు. 16 గంటల్లో పనిని పెంచడం ద్వారా లక్ష్యాలను సాధించుచున్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు డి.లలిత్ కుమార్, జి.నాగేశ్వరరావు, డి.వెంకటేశ్వర్లు, సర్వే రెడ్డి, లక్ష్మీపతి గౌడ్, శ్రీనివాసచారి, ఎస్ రమేష్, వెంకట్రావు, సురేష్ వెంగళరావు మేరీ కుమారి రాముడు అనురాధ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.