Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజల సౌకర్యం కోసం కొమరారం మండలం, ఇల్లందు రెవెన్యూ డివిజన్ చేయాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మండలంలో గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరారంను మండలంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజులుగా చేపడుతున్న రిలే నిరాహారదీక్షకు మద్దతు తెలుపుతూ దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కొమరారాన్ని మండలంగా ప్రకటించాలని గత ఎనిదేళ్లుగా పోరాటం సాగిస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో కూడా 2015 సంవత్సరం సెప్టంబర్ 21న అప్పటి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ సైతం వినతి పత్రం అందజేయటం జరిగిందని గుర్తుచేశారు. అనంతరం కొమరారం గ్రామ శివార్లలో గల సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన బోర్ ను ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నూతన హంగులతో నిర్వహించ బడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థుల్లో చదువుపై ఉన్న నైపుణ్యాన్ని పరిశీలించి, మధ్యాన్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇటీవల మృతి చెందిన పట్టేటి నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. జే.కే కాలనీ, సీ.ఈ.ఆర్ క్లబ్ నందు పట్టణానికి చెందిన మైనారిటీ నాయకులు అజ్జూ గారి సోదరి నిఖా కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించారు. బొజ్జాయి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎస్.ఎస్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కల్తీ లక్ష్మయ్య రమాదేవి కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ చిరంజీవి, ఎంపీడీఓ అప్పారావు, బాలాజీ నగర్ సర్పంచ్ స్వాతి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు రాము, సురేందర్, రాంబాబు, నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం, చిల్లా శ్రీనివాసరావు, పాల్గొన్నారు.