Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టేకులపల్లి సబ్ స్టేషన్ ముందు సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ ముందు గురువారం ధర్నా జరిగింది. అనంతరం అధికారికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు డి.ప్రసాద్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శి ధర్మపురి వీరబ్రహ్మ చారి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తున్నమని ప్రచారం చేసుకుంటూ 24 గంటలు కరెంటు కటింగ్ ఇస్తున్నారని ఎద్దేవ చేశారు. విద్యుత్తు కోతల వలన రైతాంగం, ఇతర కుటీర పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం వరి, మొక్కజొన్న, మిర్చి తోటలకు నీరును కట్టుకోవాలంటే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నదని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అదనంగా విధించిన ఎసిడి బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారని దాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏసిడి పేరుతో వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల నాయకులు జరుపల సుందర్, భూక్య పంతులు, భూక్య లాల్య, బానోతు లింగ, ఈసం రామస్వామి తదితరులు పాల్గొన్నారు.