Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక చర్యని నిరసిస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం చిరుమర్రి బాణాపురం గ్రామంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు అనుకూలంగా ప్రజలకు భారంగా మారిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ భారత దేశాన్ని బడా బాబులకు కొమ్ముగాస్తు ప్రజావ్యతిరేకమైన చర్యలు చేపడుతున్నారని ఆయన విమర్శించారు.కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్య ఉద్యమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్, నాయకులు బట్టు పురుషోత్తం, కందిమల్ల తిరుపతి, మాదారపు శ్రీనివాసరావు, టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, పాలవాయి పాండురంగారావు, బండి శేఖర్, గండు ఉపేందర్, మోర రామకృష్ణ, గాలి కోటయ్య, మండేపూడి శ్రీనాథ్, దోమల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల : కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు, వ్యవసాయ కార్మికులకు మొండి చేయి చూపించిందని రైతు సంఘం జిల్లా నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని తనికెళ్ళ గ్రామంలో రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో గురువారం బ్లాక్ డే నిర్వహించారు. కార్యక్రమంలో చల్లా నారాయణ, వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, దుర్గం రామలక్ష్మణ్, వెంకన్న నాగులు పాల్గొన్నారు.
సత్తుపల్లి : దేశానికి వెన్నుముక లాంటి వ్యవసాయ రంగానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించడం సిగ్గుచేటని తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు రావుల రాజబాబు విమర్శించారు. బుధవారం దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన బ్లాక్డేలో భాగంగా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో రైతులతో కలిసి బడ్జెట్ ప్రతులను రాజబాబు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ నాడు నల్లచట్టాలు తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించి అందరూ ప్రతిఘటించడంతో దారిమార్చుకుని నేడు బడ్జెట్లో కోతలు విధిస్తూ రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు బడ్జెట్ కేటాయించడానికి చేతులు రానటువంటి సర్కార్ ఉండడం మనందరి దౌర్భాగ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ రైతుల దెబ్బను కచ్చితంగా రుచి చూస్తారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు కుమారస్వామి, కంచర్ల వెంకటేశ్వరరావు, విష్ణువర్థన్, నాగేశ్వరరావు, మేకల కృష్ణ, వంశీ, అనిల్ పాల్గొన్నారు.