Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరావు
నవతెలంగాణ- ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించాలని కార్మికులకు, ఉపాధి కార్మికులకు, రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరావు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీకాంత్ ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అన్నారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం, సిఐటియు ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం పత్తి మార్కెట్ ఎదుట కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు వ్యతిరేకంగా బ్లాక్ డే పాటించారు. ఎర్ర శ్రీని వాసరావు అధ్యక్షతన నిరసన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 45 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 60 వేల కోట్లు తగ్గించి, ఉపాధికి 30 వేల కోట్లు తగ్గించి, ఆహార భద్రతకి 90 వేల కోట్లు తగ్గించి, పేదలకు కార్మికులకు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని వారు మండిపడ్డారు. కార్పొరేట్లకు 18 లక్షల కోట్లు రాయితీలు ప్రకటించిన మోడీ బిజెపి ప్రభుత్వం సామాన్యులకు,పేదలకు, రైతులకు, కార్మికులకు బడ్జెట్ కేటాయించడంలో చిత్తశుద్ధి లేదన్నారు. ఉపాధికి, ఆహరభద్రతకి, కార్మికులకు, 40% బడ్జెట్ కేటాయించాలని, విద్య, వైద్యానికి 25 శాతం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ. ఆల్ హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూక్యా శ్రీనివాసురావు, మద్ది సత్యం, పత్తిపాక నాగ సులోచన, షేక్ హిమామ్, పగడాల మోహన్ రావు, సిఐటియు 3 టౌన్ కన్వీనర్ ఎర్ర మల్లికార్జున్ , సిఐటియు త్రీ టౌన్ కో కన్వీనర్ వేల్పుల నాగేశ్వరరావు, రంగు హనుమంత చారి, పాశం సత్యనారాయణ, సోమనబోయిన వెంకటేశ్వర్లు,పెద్దోజు ఉపేంద్ర చారి, షేక్ మస్తాన్, హెచ్ వెంకటేశ్వరరావు, నల్ల మాస వీరస్వామి, మచ్చ కృష్ణ, భాష బోయిన ఉపేందర్, హెచ్ మల్లేష్, సరికొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.