Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
దానవయిపేటకి చెందిన మడకం జోగయ్య అనే గిరిజన రైతుకు చెందిన సుమారు 10 క్వింటాల పత్తికి నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ప్రమాదవశాత్తు పత్తికి నిప్పంటుకొని పూర్తిగా కాలిపోయింది. పంట పొలం నుండి పత్తి తీసి పొలంలోనే ఒక మడిలో పాక వేసి అందులో ఉంచారు. ఒకే రైతుకి చెందిన సుమారు 10 క్వింటాల్ పత్తి కాళీ బూడిద అయ్యింది. సుమారు దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుందని తెలుస్తుంది.
జరిగిన నష్టానికి అత్యంత బీద రైతు జోగయ్య కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం ఇప్పించాలని సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.