Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ, కలెక్టర్‌కు బాధితుడి ఫిర్యాదు
నవతెలంగాణ-అశ్వారావుపేట
వారం రోజుల పాటు బాధితుడు గాయాలతో ఇంటికే పరిమితమయ్యేలా పోలీసులు భయాందోళనలకు గురిచేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ తాటి మల్లప్ప గుంపుకు చెందిన బాధితుడు వంకా బాలాజీ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... అదే గ్రామానికి చెందిన తనకు ఎలాంటి రక్త సంబంధీకుడుకాని వంకా చిన్న కన్నప్ప, వంకా వెంకటేష్‌లు తన భూమిని ఆక్రమించేందుకు దమ్మపేట ఎస్ఐ శ్రవణ్ కుమార్ ద్వారా తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తున్నాడు. ఏమాత్రం హక్కు దారులు కాని వారు తన భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ వేస్తుండగా తాను అభ్యంతరం తెలుపగా వారు తనపై దాడి చేశారని, కొద్ది సేపటికే ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి ఎస్ఎస్ఐ పిలుస్తున్నారంటూ తనను పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లారని, భూమిని ఆక్రమించేందుకు వచ్చిన వంకా చిన్నకన్నప్ప, వంకా వెంకటేశ్వర్లుకు 2 ఎకరాల భూమిని ఇచ్చేయాలని ఎస్ఐ శ్రవణ్ కుమార్ తనను బెదిరించారని ఆరోపిస్తున్నాడు. ఇందుకు తాను ఒప్పుకోక పోవడంతో తనను ఫిబ్రవరి 1, 2 తేదీల్లో దమ్మపేట పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ శ్రవణకుమార్ చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తున్నాడు. రెండ్రోజుల తర్వాత ప్రాణభయంతో పోలీస్‌లు రమ్మన్నా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదని.. పోలీస్ స్టేషన్‌కు వెళితే... భూమి ఇచ్చేయడం.. లేకుంటే ఎస్ఐ చేతిలో చచ్చిపోవడం జరుగుతుందని భయమేసి వెళ్లలేదని బాధితుడు చెబుతున్నాడు. వారం రోజుల పాటు గ్రామంలోని ఆర్ఎంపీ నాగరాజుతో వైద్యం చేయించుకున్నా నొప్పులు, వాపులు తగ్గకపోవడంతో ఈ నెల రెండు రోజుల క్రితం అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి చేరగా ఇక్కడి వైద్యులకు గాయాల ప్రభావం అంతుపట్టక సత్తుపల్లిలో పరీక్షలు చేయించుకోవాలని చెప్పగా శుక్రవారం పరీక్షలు చేయించుకున్ననని చెబుతున్నాడు.
వారసత్వపు భూమిపై ఇతరుల కన్ను
దమ్మపేట మండలం జగ్గారం గ్రామపంచాయతీ తాటి మల్లప్ప గుంపు గ్రామ శివారు సర్వే నంబరు 29లో తన తాత వంకా కన్నప్పకు 2000 సంవత్సరంలో ట్రైబల్ కోర్టు ద్వారా సంక్రమించింది. కన్నప్ప ఒకే కుమారుడు బుచ్చన్న.. బుచ్చన్నకు ఒకే కుమారుడు బాలాజీ. కన్నప్ప రెండేళ్ల క్రితం వరకు జీవించి ఉన్నాడని ఆయన ఉన్నంత కాలం తమ భూమిని తామే సాగు చేసుకున్నామని మా తాత చనిపోయాక కూడా ఎవరూ రాలేదని, ఇటీవల వంకా చిన్న కన్నప్ప, వంకా వెంకటేష్‌లు తన భూమిలోకి వచ్చి తనను బెదించి పోలీసుల ద్వారా తనపై దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు.
కలెక్టర్లు, ఎస్పీలకు ఫిర్యాదు
తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు ధైర్యం చేయడానికి వారం వట్టిందని, కొం దరి ప్రోత్సాహంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 8, 9 తేదీలలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయం అయి అశ్వా రావుపేట సీఐ బాలకృష్ణ దృష్టికి తీసుకు వెళ్లగా వారిరువు రూ సమీప బంధువులని, వారికి భూ వివాదం ఉండటంతో స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వాహించారని అన్నారు.