Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం పోడు చేసుకుంటున్న సాగు దారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) లక్ష్మీదేవిపల్లి మండల కార్యదర్శి ఉప్పనపల్లి నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పోడు సాగు చేసుకుంటున్న వేలాది మంది రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేని యెడల పాడు సాగు దారులందరినీ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. పోడు సాగుదారులైన గిరిజన, గిరిజనేతర పేద రైతులు గత నాలుగు నెలల క్రితం గ్రామ పంచాయతీ పరిధిలో ఎఫ్ఆర్సీ కమిటీ ద్వారా దరఖాస్తులు తీసుకొని సర్వే చేయించారని, నాలుగు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం హక్కు పత్రాలు జారీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలని డిమండ్ చేశారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి తాహసిల్దార్కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు అమర్ సింగ్, తేజావత్ వెంకన్న, తేజ, శ్రీను, వాంకుడోత్ సురేష్, అజ్మీర లాల్ సింగ్, గుగులోత్ సూర్య తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడు సాగు దారుడుకి హక్కు పత్రాలు ఇవ్వాలని, అటవి హక్కుల చట్టం అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. పోడు సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీటీ సుచిత్రకు అందజేసి, మాట్లాడారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం చట్టబద్ధత అని అటవీశాఖ అధికారులు నిర్ణయం కాదని అన్నారు. పోడు భూములు సర్వే చేయని వాటిని సర్వే చేయ్యాలని, పోడు సాగుదారుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చిరంజీవి, ముల్లగిరి గంగరాజు, మడిపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, జోగారావు, రాజబాబు, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : అటవీ భూములను పోడుగుట్టి సాగు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కులు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొర్స చిలకమ్మ, సరియం రాజమ్మలు డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సంబంధిత సెక్షన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి తోడం తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో కోర్స చిలకమ్మ, సరియం రాజమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్న నల్లబెల్లి కాశీనగరం గ్రామపం చాయతీ సర్పంచులు మీడియం జయ, పూనెం కనకదుర్గ, పెసా కమిటీ చైర్మన్ సున్నం వెంకటేశ్వర్లు, వెంకన్న బాబు, సుబ్బారావు, భూపతి, కామయ్య, మంగమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
కరకగూడెం : పోడు భూమి సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించిరు. అనంతరం తహశీల్దార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చర్ప సత్యం, ఊకే నరసింహారావు, శంకరయ్య, పుల్లయ్య, సమ్మయ్య, నరేందర్, గొగ్గలి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021లో పోడు భూములు సర్వే చేసిన వారికి పట్టాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఫారెస్ట్ అధికారులు బలవంతంగా పోడు రైతులు దగ్గర నుండి లాక్కున్న భూములకు సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అర్హత కలిగిన నిరుపే దలకు స్థలం లేని వారికి డబల్ బెడ్ రూమ్‌లు కట్టించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తదితర సమస్యలపై ఆర్ఐ అక్బర్ పాషాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భయ్యా రాము, బర్ల తిరపతయ్య, నిమ్మల అప్పారావు, మిరియాల ఈశ్వరమ్మ, గన్నూరి సాయిబు తదితరులు పాల్గొన్నారు.
చెర్ల : మండలంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడుదారుడికి హక్కు పత్రం ఇవ్వాలని సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్ మాట్లాడుతూ మండలంలో 36 గ్రామాల్లో పోడు భూములకు సర్వేకి అర్హులని 4793 మంది ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రం ఇవ్వాలని అన్నారు. మండలంలో ఎన్నో ఏళ్ల నుంచి అగ్నికి ఇల్లు ఆహుతి అవుతుంటే ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మచ్చ రామారావు, పొడుపు కంటి సమ్మక్క, వరదల వరలక్ష్మి పరిషిక సూరిబాబు, ఇరప ముత్తయ్య, షారోన్, లావణ్య, రమాదేవి, కడవర్తి సమ్మక్క, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోడు భూములకు పట్టాలివ్వాలని సర్వే చేసిన అన్ని భూములకు హక్కు పత్రాలు కల్పించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ విజయ చందర్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం తాళ్లూరి కృష్ణ అధ్యక్షత జరిగిన సభలో మండల కార్యదర్శి అబ్దుల్ నబి మాట్లాడుతూ మండలంలో ఎనిమిది వేల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్యం మోహన్ రావు, ధారావత్ రాందాస్, శంకర్, హుస్సేన్, కౌసల్య, సరిత, విజయ, శంకర్, సుధాకర్, లలిత, వీరస్వామి, రాజు, వెంకన్న, అమ్మీ, హేమ్లి తదితరులు పాల్గొన్నారు.