Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 101 బిందెలతో అమ్మోరు చెట్టుకు గంగ స్నానం
- అడపడుచులకు సారె అందజేసిన ఆలయ కమిటీ
- ఉర్రూతలూగించిన రాజమండ్రి వారి సినీ అర్కెస్ట్రా
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గ్రామంలో తర తరాలుగా వెలసిన గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ మహిమలు గల తల్లిగా తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న చత్తీష్‌ఘడ్, ఒడిస్సా రాష్ట్ర ప్రజల ప్రజలు ఆరాద్య దేవతగా కోరిన భక్తులకు కొంగు బంగారంగా కోర్కెలు తీర్చే తల్లిగా విరాజిల్లుతోంది. ప్రతి రెండేళ్లకు ఒక సారి అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 22వ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం ఐదవ రోజు గ్రామానికి చెందిన మహిళలు మమ్ములను మా కుటుంబ సభ్యులను చల్లంగా చూడు తల్లి అంటూ గ్రామానికి చెందిన ఆడ పడుచులు పవిత్ర గోదావరి నీళ్లను నిండు బిందెలతో తీసుకు వచ్చి అమ్మోరు చెట్టుకు గంగ నీళ్లు పోసి తమ భక్తిని చాటారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారు జాతర ఉత్సవాలలో భాగంగా దర్శనం కోసం వచ్చిన అడపడుచులకు పసుపు, కుంకుమతో పాటు సారె అందజేశారు. కాగా అమ్మవారి అలంకరణలో భాగంగా భద్రాచలం వాస్తవ్యులు నాగతులశమ్మ వారి కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరతో ఉదయం అలంకరణ, చర్ల మండలం గొంపెల్లి గ్రామ వాస్తవ్యులు గొలపత్తి మురళీకృష్ణ, లలిత భవాని వారి కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరతో మద్యాహ్నం అలంకరణ, భద్రాచలం వాస్తవ్యులు గోళ్ల భూపతిరావు, మంజులారాణి వారి కుటుంబ సభ్యులు అందజేసిన పట్టు చీరతో సాయంత్రం అలంకరణతో పాటు అభిషేకములు, పుష్పాలంకరణ, కుంకుమపూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దాతలు అందజేసిన విరాళాలతో సుమారు 5 వేల మందిక అన్నదానం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందుతు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సీఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండగా, దుమ్ముగూడెం గ్రామ పంచాయితీ సర్పంచ్ మడి రాజేష్, కార్యదర్శి సందీఫ్ ఆద్వర్యంలో పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తున్నారు. సాంస్తృతిక కార్యక్రమంలో రాత్రి 8.30 గంటలకు నిర్వహించిన రాజమండ్రి వారి సినీ అర్కె స్ట్రా ఉర్రూతలూగించడంతో పాటు ప్రేక్షకులను సందడి చేసింది.