Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలకు రేగా సుధారాణి ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు అందజేశారు. పినపాక నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు వాలి బాల్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నరసింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశశ్వరావు, మణుగూరు టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, మండలం అధ్యక్షులు ముత్యం బాబు, మండల ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి, సీనియర్ నాయకులు పట్టం రాంబాబు, యుసాఫ్, అనిల్, లక్ష్మణ్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.