Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
మండలంలోని పలు గ్రామాలలో రక్త నమూనాల సేకరణ సులానగర్ ప్రాథమిక వైద్యశాల ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టినట్లు తెలిపారు. కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ఫైలేరియాసిస్ అధికంగా ఉన్న గ్రామాలలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులను ముందస్తుగా గుర్తించడం కోసం, రక్త నమూనాలను సేకరించె ప్రక్రియలో భాగంగా తావూరియా తండా గ్రామంలో రాత్రి 10 గంటల తర్వాత 300 మందికి రక్త నమూనాలను సేకరించడం జరిగిందన్నారు. ఫైలేరియాకి సంబంధించిన పారాసైట్ క్రిమి రాత్రిపూట మాత్రమే రక్తంలో సంచరిస్తుంది కాబట్టి ఆ సమయంలోనే రక్త నమూనాలను సేకరించడం జరిగిందన్నారు. వీటిని పరీక్ష నిమిత్తం టీ హబ్ పరీక్ష కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు మానస, స్వప్న, అనసూయ, స్రవంతి, దనసరి రాంబాబు, ఆశా కార్యకర్తలు సరోజ, రజియా, ముత్తమ్మ, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.