Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ ఎంట్రన్స్ పరీక్షలో భద్రాచలం గిరిజన గురుకులం కళాశాలకు చెందిన విద్యార్థినీలు తమ ప్రతిభ చాటి జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ కు క్వాలిఫై అయ్యారు. మొత్తం ఎంట్రన్స్ పరీక్షకు 38 మంది హాజరు కాగా, ఇందులో 23 మంది బాలికలు అడ్వాన్స్‌కు క్వాలిఫై అవడం గమనార్హం. వీరిలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న బి.హేమశ్రీ 84.529 పర్సంటైల్, జి.శైశల్య 79 పర్సంటైల్, బి.కావ్య 77.4 పర్సటైల్, కె.లక్ష్మి 70.7 పర్సంటైల్ సాధించారు. వీరికి టాప్ టెన్‌లో ఉన్న ఎన్ఐటీలలో, ట్రిపుల్ ఐటీలలో సీట్లు వచ్చే అవకాశం ఉందని భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ ఎం.దేవదాసు తెలిపారు. మిగతా బాలికలు జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయటానికి క్వాలిఫై అయ్యారని వెల్లడించారు.
వీరిని శుక్రవారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా అభినందించారు. వీరికి తరఫున ఇచ్చినటువంటి అధ్యాపకులను ప్రిన్సిపల్ ప్రశంసించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ పోట్రూ సూచనలు సలహాలతో, ఏపీవో జనరల్ ఆర్సీఓ డేవిడ్ రాజు ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు ఈ విద్యార్థినిలకు సరైన తర్ఫీదు ఇవ్వటం మూలంగా జేఈఈ మెయిన్స్‌లో వీరు ప్రతిభ చాటారని ప్రిన్సిపాల్ ఎం.దేవదాస్ పేర్కొన్నారు.