Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేదిస్తున్న సిబ్బంది కొరత
- 36 ఏండ్లుగా వెతలు
నవతెలంగాణ-అశ్వారావుపేట
వేసవి కాలం అధిక ఉష్ణోగ్రత, చలి కాలం మంచు, చెలి తీవ్రత, వానాకాలం వరదలు సహజం. అందుకే ఏ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ కాలంతో తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలు సైతం అలా రూపొందిస్తారు. వేసవి ఎండాకాలం అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీస్తాయి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అయితే ఏర్పాటుకు ముందే నీటి వనరు, భవన సముదాయం సమకూర్చుకోవడం ప్రాధమిక సూత్రం. కానీ ప్రభుత్వ శాఖల్లో అన్నీ కాగితాల్లోనే కనిపిస్తాయి కానీ వాస్తవరూపంలో కానరావు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరగడం అడపా దడపా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే అశ్వారావుపేట అగ్నిమాపక శకటం మాత్రం ముందుగా నీటికోసం పరుగులు పెట్టాల్సిందే. ఈ పరిస్థితి దారుణమైన విషయం. సాదారణంగా నీటిని నింపి అప్రమత్తంగానే ఉంటారు. కానీ అగ్నిమాపక కేంద్రంలో నీటి వసతి లేకపోవడంతో స్థానిక వ్యవసాయ కళాశాల ప్రాంగణంలోనో లేక శ్రీలక్ష్మీ తులసి ఆగ్రో పేపర్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలోనో వాటి విద్యుత్ బోరుబావులు ద్వారా నీటిని నిలవ చేసుకోవాల్సి వస్తుంది. అశ్వారావుపేటలో 1987 మార్చి 31న, తహశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. 2004 ఫిబ్రవరి 08న పక్కా భవనం ప్రారంభించారు. ఈ అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక శకటం ఒకటి, అగ్నిమాపక అధికారి ఒకరు, ప్రధాన అగ్నిమాపకులు ఇద్దరు, అగ్నిమాపకులు పది మంది, డ్రైవర్లు ముగ్గురు కలిపి మొత్తం 15 మంది సిబ్బంది ఉండాలి. కానీ ప్రస్తుతం 8 మంది ఉండగా ఇద్దరు సెలవు పై వెళ్ళగా 6 మాత్రమే విధుల్లో ఉన్నారు. అగ్నిమాపక అధికారులు సైతం ఇక్కడ అత్యధికంగా ఇంచార్జి లే ఉండటం ఆచార్యంగా ఉంది. ఈ కేంద్రంలో ఒకసారి బోరు వేసినప్పటికీ నీటి లభ్యత జరగలేదు. 36 ఏండ్లుగా వ్యవసాయ కళాశాల, పేపరు బోర్డు నీటి పై ఆధారపడే ఈ అగ్నిమాపక కేంద్రం పని చేయడం బాధాకరం. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎంపీపీ శ్రీరామ మూర్తి ఈ కేంద్రం దృష్టిసారించి నీటి వసతి కల్పించాలని, సిబ్బందిని నియమించాలని ఈ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.