Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగు విస్తరిస్తున్న దృష్ట్యా ఫాం ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఈ సాగు పై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా మహా బూబ్ నగర్ జిల్లాలోని 10 ఎఫ్పీఓల బృందాలు శుక్రవారం అశ్వారావుపేటలోని ఆయిల్ ఫాం క్షేత్రాలను, పరిశ్రమలను పరిశీలించారు. అక్కడి ఇందిరా ప్రియదర్శిని విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ బాధ్యులు గోవర్థని నేతృత్వంలో 50 మంది ఆసక్తి, ఔత్సాహిక రైతులు ఇక్కడ క్షేత్రాలను సందర్శించారు.
వీరికి ఆయిల్‌ఫెడ్ డివిజనల్ మేనేజర్ ఆకుల బాలక్రిష్ణ ఆయిల్ ఫాం సాగుతో ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీలు, యాజమాన్యం పద్దతులు, ఆదాయ వ్యయాలు సోదాహరణంగా వివరించారు. వీరి భోజన వసతి సౌకర్యాలను ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ నాయుడు రాధా క్రిష్ణ పర్యవేక్షించారు.