Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్లకు వినతి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరులో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని టీబీజీకేఎస్ నాయకులు సింగరేణి డైరెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఏరియాకు పర్యటనకు వచ్చిన డైరెక్టర్ ఎన్.బలరాం, ఎస్వికె శ్రీనివాస్, జి.వెంకటేశ్వర్ రెడ్డి కలిసి సమస్యలు పరిష్కరించడం కోరారు. మణుగూరు ఏరియా పర్యటనకు వచ్చిన డైరెక్టర్స్‌ను స్వయంగా కలసి పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఏరియా బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు సూచన మేరకు ఏరియా బ్రాంచి నాయకులు, స్థానిక జీఎం కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం ఏరియా నందు నెలకొని ఉన్న పలు రకాల సమస్యలను, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పరిష్క రించాలని కోరారు. ముఖ్యంగా పాత ఎంసీ క్వార్టర్స్‌కు అదనపు పార్కింగ్ షెడ్స్ నిర్మాణం చేయాలని కోరారు. ఓసీ తరలింపు దృష్ట్యా నూతనంగా నిర్మిస్తున్న కనకదుర్గ అమ్మ వారి ఆలయంకు రూ.50 లక్షల నిధులు కేటాయించాలన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పార్క్‌కు ఓపెన్ జిమ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీఈఆర్ క్లబ్ నందు ఉన్న నూతన సామగ్రి కొనుగోలుకు మరో 05 లక్షలు మంజూరు చేయాలన్నారు. ఏరియా హాస్పటల్ నందు బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ అవకాశం లేకపోవడంతో ఏరియా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏరియా హాస్పటల్లో బ్లడ్ స్టోరేజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణాపాయ, అత్యవసర పరిస్థితుల్లో కంపెనీ హైద్రాబాద్ రిఫరల్ చేస్తోందని అక్కడ సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ హాస్పటల్‌కు, సింగరేణియులకు అనుసంధాన కర్తగా భాధ్యత గల వ్యక్తినీ నియమించినప్పటికీ తను పూర్తి స్ధాయిలో సర్వీస్ అందించలేకపోతున్నాడని తన నిర్వాకం వల్ల అనేక మంది సేవలు అందక అవస్ధలు పడుతున్నారని దీనిపై యాజమాన్యం దృష్టి సారించాలని సూచించారు. వీటితో పాటు ఏరియా నందు నెలకొని ఉన్న మరికొన్ని సమస్యలను వినతి పత్రం రూపంలో అందించగా టీబీజీకేఎస్ చేసిన పలు అంశాల, అభివృద్ధి పనులపై వారు సానుకూ లంగా స్పందించి త్వరితగతిన సమస్యల పరిష్కా రానికి చర్యలు చేపడతామని తెలిపినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్ రవుఫ్ బ్రాంచి నాయకులు వీర భద్రయ్య శివాజి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.