Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11, 12 తేదీల్లో సింగరేణి ఉమెన్స్ కాలేజిలో
- విలేకర్ల సమావేశంలో ఆకాడమి కార్యదర్శి వెంకటేశ్వర రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11,12 తేదీలలో రెండు రోజుల పాటు తెలంగాణ మీడియో అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తు న్నామని రాష్ట్ర తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. శుక్రవారం స్థానిక పిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రెస్ ఆకాడమీ ఆద్వర్యంలో పూర్వ 10 జిల్లాలో ఇప్పటికే శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత మొదటి సారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి మహిళా కళాశాలలో 11,12 తేదీలలో రెండు రోజుల పాటు వర్కింగ్ జర్నలిస్టులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఉర్ధూ, మహిళా, దళిత జర్నలిస్టులకు హైద్రాబాద్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తెలంగాణ మీడియా అకాడమి జర్నలిస్టుల సంక్షేమానికి కృషిచేస్తున్న విషయాన్ని వివరించారు. కోవిడ్-19 వైరస్ కారణంగా మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేశామని, వైరస్ సోకిన వారికి ఆర్ధిక సహాయాన్ని ఇచ్చామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లల చదువులకు విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పింస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమా నికి జర్నలిస్టులందరూ ఆహ్వానితులేనని, జర్నలిజానికి ఉపయుక్తమైన పుస్తకాలు ఈ సందర్భంగా శిక్షణా తరగతుల్లో అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో మీడియా అకాడమీ మేనేజర్ వెంకటేష్, మీడియా అకాడమీ చైర్మెన్ ఓఎస్డీ రహమాన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరసంబంధాల అధికారి శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.